LIVE: నీతి ఆయోగ్ సీఈవో మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Niti aayog live - NITI AAYOG LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 6:30 PM IST

Updated : Jul 27, 2024, 7:04 PM IST

NITI Aayog Meeting 2024 : 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్క భారతీయుడి ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండటం వల్ల ఈ ఆశయ సాధనలో రాష్ట్రాలు ముఖ్యమైన పాత్ర పోషించేందుకు అవకాశం ఉందని తెలిపారు. పాలకమండలి సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు నీతి ఆయోగ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది.  నీతి ఆయోగ్ సమావేశంలో ఈ దశాబ్దం మార్పులు, సాంకేతికత, భౌగోళిక రాజకీయాలు సహా అవకాశాలతో కూడుకున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ అవకాశాలను భారత్ అందిపుచ్చుకుని అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా విధానాలను రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ను అభివృద్ ధిచెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ఇది ఒక అడుగు అని పేర్కొన్నారు. మనం సరైన దిశలోనే పయణిస్తున్నామని వందల ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారిని జయించామని వెల్లడించారు. ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో ఉన్నారన్న ఆయన, రాష్ట్రాల సంయుక్త కృషితో వికసిత్ భారత్‌-2047ను సాకారం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. వికసిత్ రాష్ట్రాలు, వికసిత్ భారత్‌ను తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.  నీతి ఆయోగ్​ మీటింగ్​కు సంబంధించిన వివరాలను సీఈవో ప్రకటిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. 
Last Updated : Jul 27, 2024, 7:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.