ETV Bharat / state

ఆర్చరీ జ్యోతి సురేఖకు ఖేల్‌రత్న ఇవ్వాలి: ఏపీ హైకోర్టు - HIGH COURT ON ARCHER JYOTHI SUREKHA

విలువిద్య క్రీడాకారిణి జ్యోతిసురేఖకు ఖేల్‌రత్న ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశం - ఉత్తర్వుల కాపీని విడుదల చేసిన ధర్మాసనం

High_Court_ON_archer_Jyothi_Surekha
High_Court_ON_archer_Jyothi_Surekha (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 7:01 PM IST

Updated : Jan 28, 2025, 7:19 PM IST

AP HC Orders to Give Khel Ratna Award to Archer Jyothi Surekha: ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖకు మేజర్ ధ్యాన్​ చంద్ ఖేల్​రత్న అవార్డును ప్రదానం చేయాలని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జ్యోతి సురేఖకు భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవం కల్పించాలని హైకోర్టు సూచించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమె సాధించిన విజయాలు పరిగణలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని విషయాలు క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

తనకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు విషయంలో అన్యాయం జరిగిందంటూ 2023లో హైకోర్టులో జ్యోతి సురేఖ రిట్ పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు, ఉన్నం అఖిల్ చౌదరిలు వాదనలు వినిపించారు. కేంద్ర క్రీడలశాఖ నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం 148.74 పాయింట్లు పొందారని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఖేల్‌రత్నకు ఎంపికైన ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి 58.5 పాయింట్లు పొందారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

విద్యార్థి పేరు తప్పు - NTAతో మాట్లాడిన మంత్రి లోకేశ్ - 30 నిమిషాల్లో ప్రాబ్లం​ సాల్వ్​

ఒకేసారి 3 బంగారు పతకాలు: పిటిషనర్‌ సాధించిన పాయింట్లను ఎంపిక కమిటీ (సెలక్షన్‌ కమిటీ) పరిగణనలోకి తీసుకోకపోవడం, సహేతుకమైన కారణం లేకుండా పిటిషనర్‌కు ఖేల్‌రత్న అవార్డును నిరాకరించడం ఎంపిక విధానానికి విరుద్ధమన్నారని వాదనలు వినిపించారు. పిటిషనర్‌ సాధించిన అవార్డులు, పాయింట్లను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో 8 మెడల్స్‌ సాధించారని తెలిపారు. ఈ మెడల్స్‌ పొందిన వారిలో పిటిషనర్ దేశంలోనే రెండో క్రీడాకారిణి అని ధర్మాసనానికి తెలిపారు. ఏషియన్ గేమ్స్‌లో ఒకేసారి 3 బంగారు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత క్రీడాకారిణికి అన్నారు.

పిటిషనర్‌ కన్నా తక్కువ పాయింట్లు పొందిన వారిని ఖేల్‌ రత్న అవార్డు-2023కి ఎంపిక చేశారని న్యాయవాదులు వాదనలు వినిపించారు. అవార్డుకు ఎంపిక చేసేందుకు క్రీడల్లో గెలుపొందిన పతకాలకు 80 శాతం వెయిటేజ్‌ పాయింట్లు ఇస్తారని అన్నారు. మిగిలిన 20 పాయింట్లు ఎంపిక కమిటీ విచక్షణ మేరకు ఇస్తుందని తెలిపారు. పతకాల ప్రకారం సురేఖకు 148.74శాతం పాయింట్లు వస్తాయని కానీ ఈ అవార్డుకు ఎంపికైన వేరే క్రీడాకారులు 58.5 పాయింట్లే పొందారని అన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి సురేఖ అవేదనలో న్యాయం ఉందని భావించారు.

అరకులో చలి పండుగ - రూ.కోటి మంజూరు చేసిన పర్యాటక శాఖ

పొట్టి గొర్రెలు, పొడవాటి చెవుల మేకలు - ఆ ఫాంహౌస్​లో అంతా విచిత్రమే

Last Updated : Jan 28, 2025, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.