LIVE : కేంద్ర బడ్జెట్‌పై ఈటీవీ భారత్ చర్చా కార్యక్రమం - Union Budget 2024 LIVE - UNION BUDGET 2024 LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jul 23, 2024, 11:01 AM IST
|Updated : Jul 23, 2024, 3:07 PM IST
Union Budget 2024 LIVE : అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాకారం దిశగా అడుగులేస్తోన్న కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి సమర్పించిన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో ఏపీపై నిర్మలమ్మ వరాలు కురిపించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలోని 3.0 ప్రభుత్వం పూర్తిస్థాయి పద్దును మంగళవారం సమర్పించింది. అభివృద్ధి, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని, వృద్ధికి ఊతమివ్వడంతో పాటు ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై లోక్‌సభ, రాజ్యసభల్లో చెరో 20 గంటల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్‌పై ఈటీవీ భారత్ చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jul 23, 2024, 3:07 PM IST