సాగర్‌ను పరిశీలిస్తున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం - నీటి నిల్వలు, స్పిల్ వేలపై ఆరా!
🎬 Watch Now: Feature Video
National Dam Authority Team Visit Sagar : నాగార్జున సాగర్ డ్యామ్‌ను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) సభ్యులు పరిశీలించారు. ఇవాళ్టి నుంచి 15వ తేదీ వరకు డ్యామ్‌ను కేఆర్ఎంబీ(KRMB) సభ్యులు, రెండు రాష్ట్రాల అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ నిపుణుల బృందం ఎన్డీఎస్ఏ సభ్యుడు రాకేశ్ కశ్యప్ నేతృత్వంలో 8 మంది సభ్యులు మూడు రోజుల పాటు డ్యాం సేఫ్టీ, స్పిల్ వే, నీటి నిల్వలు, ఇతర అంశాలపై ఆరా తీయనున్నారు. బుధవారం నాగార్జున సాగర్ దగ్గర అధికారులు సమీక్ష జరపనున్నారు.
3 Days NDSA Team Investigate Nagarjuna Sagar : నాగార్జునసాగర్ స్పిల్ వేలో కాంక్రీట్ పనులు, సీఫేజ్ గుంతలకు మరమ్మతులు, కుడి కాలువ హెడెగ్యులేటర్ గేట్లకు మరమ్మతులు, పూడికను బయటకు పంపే గేటు మార్పిడి వంటి పనులు చేయాల్సి ఉంటుందని కేఆర్ఎంబీ ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. నీటిని విడుదల చేసినప్పుడు వేగంగా వెళ్లడం లేదని తెలుస్తోంది. ఈ పనులను కూడా చేయాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరదలు వచ్చినప్పుడు సాగర్ నుంచి ఆ నీటిని ఏకకాలంలో విడుదల చేసేందుకు మరో స్పిల్ వే అవసరమని గతంలో నిపుణుల కమిటీ గుర్తించింది. అది కూడా ఈ తనిఖీలలో చర్చకు రానున్నట్లు సమాచారం.