దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుందన్న దొంగ - కడుపు నిండా తినిపించి మరీ! - Nalgonda Theft Viral Video - NALGONDA THEFT VIRAL VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2024, 1:26 PM IST
Nalgonda Theft Viral Video : దొంగలకు పాత చెప్పైనా బంగారమే. అర్ధరాత్రి అయిందంటే చాలు దొంగలు రెచ్చిపోతున్నారు. చడీచప్పుడు కాకుండా ఇళ్లలోని నగదు, బంగారాన్ని చోరీ చేస్తున్నారు. బడి, గుడి, ప్రభుత్వ సంస్థలు, ఇళ్లు ఇలా ఏదైనా సరే, అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను స్థానికులు పట్టుకున్నారు. గ్రామస్థులంతా కలిసి దేహశుద్ధి చేస్తుండగా, ఆ దొంగ ఆకలి వేస్తుందని చెప్పడంతో పులిహోర తినిపించి మరీ దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ దొంగను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఈ దొంగపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.
ఊరికి వెళ్లేటప్పుడు ఇంట్లో ఉన్న బంగారం, విలువైన వస్తువులు వెంట తీసుకొని వెళ్లాలని ప్రజలకు పోలీసులు సూచించారు. తోటి వారిని తమ ఇంటివైపు ఓ కంట కనిపెడుతూ ఉండాలని కోరాలని సూచించారు. కొత్త వ్యక్తులు, ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.