నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేసిన అధికారులు - Sagar water release for Left Canal

🎬 Watch Now: Feature Video

thumbnail

Nagarjuna Sagar water released for Left Canal : నల్గొండ జిల్లాలోని నాగార్జుసాగర్ ఎడమ కాల్వకు తాగు నీటి అవసరాల కోసం ఎన్ఎస్పీ అధికారులు నీటి విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాగు నీటి అవసరాల దృష్ట్యా మాత్రమే నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 2500 క్యూసెక్కుల మేరకు నీటి విడుదల కొనసాగుతోంది. క్రమక్రమంగా పెంచుకుంటూ నీటి విడుదల కొనసాగనుంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న ప్రధాన రిజర్వాయర్లను తాగునీటి కోసం నింపేందుకు ఈ నీటిని వాడనున్నట్లు సమాచారం. 

ఎన్ని రోజులపాటు ఎన్ని క్యూసెక్కులు అనేది పూర్తి సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఈ నీటిని వృథా చేయకుండా తాగునీటి అవసరాలకు వాడుకోవాలని సూచించారు. ఇదికాగా మరోవైపు ఫిబ్రవరి 29న కేఆర్‌ఎంబీ అధికారులు నాగార్జునసాగర్ నుంచి కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నీటిని విడుదల చేశారు. వేసవి దృష్ట్యా తాగు నీటి అవసరాల నిమిత్తం నీరు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేఆర్‌ఎంబీ అధికారులు నీటిని విడుదల చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.