ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుంది - మళ్లీ టీవీ ముందు కూర్చుంటా : తీన్మార్ మల్లన్న - Teenamar Mallanna On BC Reservation - TEENAMAR MALLANNA ON BC RESERVATION
🎬 Watch Now: Feature Video
Published : Aug 26, 2024, 11:54 AM IST
MLC Teenamar Mallanna Sensational Comments On BC Reservation : రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోతే భూకంపం సృష్టిస్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించారు. రిజర్వేషన్‌ను అమలుచేయకపోతే ప్రజల్లో ఏ ఒక్కరు కూడా తిరగలేరని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను అమలుచేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా కాజీపేటలో బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో సమర శంఖరావం నిర్వహించారు. బీపీ మండల్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో, ఆయన మనవడు సూరజ్ యాదవ్ హాజరయ్యారు. బీపీ మండల్ చిత్రపటానికి తీన్మార్ మల్లన్న, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు నివాళులర్పించారు.
బీసీల సహకారంతోనే తాను గెలిచినట్లు వెల్లడించారు. ఆప్ కీ బార్ బీసీ సర్కార్ తెలంగాణలో రాబోతుందని, బిచ్చగాళ్లలా కుల సంఘాలకు రూ.50కోట్లు ఏ లెక్కన కేటాయిస్తారని, బడ్జెట్లో బీసీలకు రూ.3వేల కోట్లు పెడితే తాను నిర్భయంగా ప్రశ్నించినాని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తను ఓడిపోవాలని కోరుకున్న ఓ మంత్రి సహా ఎవ్వరినీ వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో తన పదవి పోయినా లెక్కచేయనని, మహా అయితే మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని తీన్మార్ మల్లన్న అన్నారు.