'దిల్లీలో సైతం మార్పు రావాలి - పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం' - MLC Kodandaram Interview
🎬 Watch Now: Feature Video


Published : Jan 26, 2024, 4:52 PM IST
MLC Kodandaram Interview : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితంకావడం పట్ల ఆచార్య కోదండరాం సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడం కోసం ఒక మార్గం దొరికిందన్నారు. అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఆమోదించిన గవర్నర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా చట్టసభల్లోకి వెళ్తున్నామని అందుకే కొంత అధ్యయనం చేసి అడుగు పెడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా సహకరిస్తూనే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
TJS Chief Kodandaram Appointed as MLC in Governor Quota : చట్టసభల ద్వారా ప్రజాసమస్యలపై గళమత్తటమే కాకుండా, ఆ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కాబట్టి సరిగ్గా ఈ నేపథ్యానికి మాకు వచ్చిన ఈ అవకాశమనేది చాలా ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో ప్రజాసమస్యలపై ఏవిధంగా పోటారటం చేశారో, అంతేస్థాయిలో ఇప్పుడు కూడా ప్రజాగొంతుకగా నిలబడి పనిచేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా దిల్లీలో కూడా మార్పు రావాలంటున్న కోదండరాంతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ఫేస్ టూ ఫేస్.