తల్లిని చూసి కన్నీరు పెట్టుకుని, హత్తుకున్న ఎమ్మెల్సీ కవిత - వీడియో వైరల్ - mlc kavitha reach home video viral - MLC KAVITHA REACH HOME VIDEO VIRAL

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 8:37 PM IST

MLC Kavitha Cried on Seeing his Mother : బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత దాదాపు 5 నెలలు తర్వాత తిహాడ్​ జైలు నుంచి బెయిల్​పై బయటకు వచ్చారు. నేడు ఆమె దిల్లీ నుంచి హైదరాబాద్​ చేరుకున్నారు. హైదరాబాద్​ చేరుకున్న తర్వాత కవితకు బీఆర్​ఎస్​ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భారీ కాన్వాయ్ మధ్య శంషాబాద్​ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్​ తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే కవిత నివాసం వద్దకు చేరుకున్న బీఆర్​ఎస్​ శ్రేణులు సందడి చేశారు. డ్యాన్సులు, డప్పు చప్పుళ్లతో కోలాహలం చేశారు. ఆమె ఇంటికి రాగానే బీఆర్​ఎస్​ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. 

కవిత కారు దిగి ఇంట్లోకి వెళుతున్నప్పుడు శ్రేణులు జై కవితక్క అంటూ నినాదాలు చేశారు. అనంతరం కవితకు దిష్ఠి తీశారు. అప్పటికే ఇంట్లో కవిత తల్లి శోభ, కేటీఆర్​ సతీమణి శైలిమ ఉన్నారు. కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని కవిత ఆలింగనం చేసుకున్నారు. తల్లి శోభకు పాదాభివందనం, ఆలింగనం చేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం సోదరుడు కేటీఆర్​కు కవిత రాఖీ కట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.