ETV Bharat / spiritual

"స్నానం చేసిన తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకూడదు - అవేంటో మీకు తెలుసా?" - Common Showering Mistakes - COMMON SHOWERING MISTAKES

Common Showering Mistakes : ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత.. దేవుడిని పూజించి నిత్యజీవితంలో పనులను ప్రారంభిస్తుంటారు అందరూ. అయితే.. శాస్త్ర ప్రకారం స్నానం చేసిన తర్వాత కొన్ని తప్పులు చేయకూడదని ప్రముఖ జ్యోతిష్య పండితుడు 'మాచిరాజు కిరణ్​ కుమార్​' చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..

Common Showering Mistakes
Common Showering Mistakes (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 11:57 AM IST

Showering Mistakes According to Astrology : మన సంప్రదాయాలు, ఆచారాల్లో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎప్పుడైనా సరే స్నానం చేసినప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని మాచిరాజు సూచిస్తున్నారు. ఇందులో చాలా మంది చేసే తప్పుల్లో ఒకటి ఖాళీ బకెట్​ని బాత్​రూమ్​లో అలాగే ఉంచడం. వాస్తు నియమాల ప్రకారం.. స్నానాల గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ బకెట్​ని ఖాళీగా ఉంచకూడదట. ఒకవేళ బకెట్​ని బాత్​రూమ్​లో పెట్టాల్సి వస్తే దానిని బోర్లించి ఉంచాలట.

స్నానం గదిని శుభ్రంగా ఉంచుకోండి
చాలా మంది స్నానం చేసిన తర్వాత వాడిపారేసిన షాంపూ ప్యాకెట్లను మూలన పడేస్తుంటారు. అలాగే విడిచిన దుస్తులను కింద పడేస్తుంటారు. ఇంకా తడి వస్త్రాలను అలానే బాత్​రూమ్​లో ఉంచి మిగతా పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ, ఇలా బాత్​రూమ్​ అశుభ్రంగా ఉండకూడదు. స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్​రూమ్​ క్లీన్​గా ఉండేలా చూసుకోవాలి. స్నానాల గది అశుభ్రంగా ఉండడం వల్ల నెగటివ్​ ఎనర్జీ వ్యాపిస్తుందట. కుటుంబంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయని చెబుతున్నారు. కాబట్టి.. స్నానం పూర్తైన తర్వాత విడిచిన వస్త్రాలు గానీ, తడి వస్త్రాలు స్నానాల గదిలో లేకుండా చూసుకోవాలి.

బొట్టు ఇలా పెట్టుకోకూడదు
కొంత మంది మహిళలు తలస్నానం చేసిన తర్వాత.. తల ఆరకుండానే కుంకుమ బొట్టు పెట్టుకుంటుంటారు. కానీ, ఎప్పుడూ ఇలా చేయకూడదు. ఎప్పుడైనా సరే శిరోజాలు పూర్తిగా తుడుచుకుని.. తడి ఆరిన తర్వాత మాత్రమే మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. లేకపోతే గ్రహాల అనుగ్రహం తగ్గిపోతుందట.

బకెట్లో మిగిలిన నీళ్లను ఇలా ఉపయోగించకండి
చాలా మంది స్నానం చేసిన తర్వాత మిగిలిన నీళ్లను కాళ్ల మీద పోసుకుంటుంటారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయకూడదట.

పదునైన వస్తువులు ఉపయోగించకూడదు
స్నానం చేసిన తర్వాత గోళ్లు తీసుకోవడానికి నెయిల్​ కట్టర్​ వాడకూడదు. స్నానం చేసే ముందే గోళ్లను కట్​ చేసుకోవాలి.

తిన్న వెంటనే స్నానం చేయకూడదు:
కొంతమందికి తిన్న వెంటనే స్నానం చేసే అలవాటు ఉంటుంది. కానీ, ఎట్టిపరిస్థితుల్లో ఇలా చేయకూడదు. మనం ఆహారం తీసుకున్న తర్వాత ఎన్ని నిమిషాలకు స్నానం చేయాలో శాస్త్రంలో చెప్పారు. ఆహారం తిన్న తర్వాత 48 నిమిషాలకు స్నానం చేస్తే మంచిదట. దీనిని ముహూర్త కాలంగా పిలుస్తారు. ఇలా.. స్నానానికి ముందు తర్వాత ఈ తప్పులు చేయకుండా ఉంటే.. అదృష్టలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవి కూడా చదవండి :

"అదృష్టలక్ష్మి మీ తలుపు తట్టాలంటే - సోమవారం ఈ పనులు అస్సలు చేయకూడదట"

పసుపు నీటితో స్నానం చేస్తున్నారా? - జ్యోతిష్యం ఏం చెబుతోందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.