Ravichandran Ashwin Net Worth : టీమ్ఇండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో టెక్నిక్‌గా బౌలింగ్ చేసి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడంలో దిట్ట. ముఖ్యంగా టెస్టుల్లో అయితే ప్రత్యర్థి బ్యాటర్లను మరింత బెంబేలెత్తిస్తాడు. అశ్విన్ క్యారమ్ బాల్ సంధించాడంటే ఇక ప్రత్యర్థులకు చుక్కలే. పిచ్ కొంచెం స్పిన్ కు సహకరించిందంటే వేరీ డేంజర్‌గా మారిపోతుంటాడు. అనిల్ కుంబ్లే తర్వాత టీమ్ఇండియా తరఫున అంతలా రాణించిన బౌలర్ ఆశ్విన్. అలాగే బ్యాట్‌తోనూ అశ్విన్ అదరగొడుతున్నాడు.
బంగ్లాతో టెస్టులో విధ్వంసం
ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అశ్విన్ సెంచరీతో(113) అదరగొట్టాడు. కష్టకాలంలో ఉన్న టీమ్ఇండియాను జడేజాతో కలిసి ఆదుకున్నాడు. అలాగే టెస్టుల్లో సెంచరీల(6) సంఖ్య పరంగా ధోనీతో సమానంగా నిలిచాడు. అలాగే 101 టెస్టులు ఆడిన అశ్విన్ ఇరవై 50+ స్కోర్లు, 30 కంటే ఎక్కువసార్లు 5 వికెట్లు (36సార్లు) పడగొట్టిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. దీంతో అతడి రికార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ అతడి నెట్ వెర్త్ ఎంతో తెలుసా?
మొత్తం ఎన్ని కోట్లంటే?
తమిళనాడులోని చెన్నైలో 1986 సెప్టెంబరు 17న రవిచంద్రన్ అశ్విన్ జన్మించాడు. ఇటీవల 38వ పడిలోకి అడుగుపెట్టాడు. అయితే తాజాగా రవిచంద్రన్ అశ్విన్ ఆస్తి 16 మిలియన్ డాలర్లు అని ఓ ఆంగ్ల మీడియా పేర్కొంది. అంటే భారత కరెన్సీలో రూ.132 కోట్లు అన్నమాట. కాగా, అశ్విన్‌కు చెన్నైలో ఓ లగ్జరీ ఇల్లు, కార్లు కూడా ఉన్నాయి. అశ్విన్ ఇల్లు ధర దాదాపు రూ.9 కోట్లు. అలాగే రూ.6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్, రూ. 93 లక్షల ధర ఉన్న ఆడి క్యూ7 కారు ఉందని సమాచారం.
బీసీసీఐ, ఐపీఎల్ ద్వారా ఏటా రూ.10 కోట్ల ఆదాయం!
రవిచంద్రన్ అశ్విన్‌కు బీసీసీఐ గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ఇచ్చింది. దీంతో అతడికి ఏటా రూ.5 కోట్లు ఆదాయం వస్తుంది. అలాగే ఐపీఎల్లో ఈ స్టార్ స్పిన్నర్ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీనికి మరో రూ.5 కోట్లు ఇన్కమ్ అశ్విన్ జేబులోకి చేరుతుంది. అంతకుముందు సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడినప్పుడు అశ్విన్ రూ.7.6 కోట్లను అర్జించాడని క్రికెట్ వర్గాల సమాచారం.
జూమ్ కర్, మూవ్, మింత్రా, ఇతర బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు అశ్విన్. అలాగే బాంబే షేవింగ్ కంపెనీ, స్పెక్స్ మేకర్స్, రామ్ రాజ్ లినెన్ షర్ట్స్ వంటి బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ల నుంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. ఒప్పో, కాల్గేట్ వంటి కంపెనీలకు ప్రమోషన్ చేస్తున్నాడు అశ్విన్.
కెరీర్ పరంగా
ఇక అశ్విన్ 101 టెస్టుల్లో 516 వికెట్లు తీశాడు. అలాగే 3422 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 14 అర్ధసెంచరీలు ఉన్నాయి. 116 వన్డేల్లో 707 పరుగులు, 156 వికెట్లు సాధించాడు. 65 టీ20ల్లో 184 రన్స్ చేశాడు. 72 మందిని ఔట్ చేశాడు. ఇలా టీమ్ ఇండియా తరఫున అశ్విన్ అదరగొడుతున్నాడు.
చరిత్ర సృష్టించిన అశ్విన్ - వరల్డ్‌లో ఏకైక ప్లేయర్‌గా రికార్డ్! - Ashwin Test Record