గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది : భట్టి - Bhatti on SLBC Project works - BHATTI ON SLBC PROJECT WORKS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2024/640-480-22499281-thumbnail-16x9-bhatti.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Sep 20, 2024, 6:37 PM IST
Deputy CM Bhatti about SLBC Project works : పదేళ్లుగా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లా ప్రాంత ప్రజలు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఆలస్యం అవ్వడం వల్ల తమ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడిందని వెల్లడించారు. ఎన్నికల సమయంలో చేపట్టిన పాదయాత్రలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పరిశీలించానని గుర్తు చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రివ్యూ చేసి పనులు పూర్తి చేయడానికి సమీక్షలు నిర్వహించినట్లు భట్టి తెలిపారు. భూ నిర్వాసితులకు కూడా తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అంతకు ముందు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పరిశీలించారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని, నిర్మాణంలో వేగం పెంచాలని ప్రాజెక్టు అధికారులను సూచించారు.