IND VS BAN First Test Shubman Gill Century : చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా పరుగులు చేస్తున్నాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
79 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. గిల్ 50 స్కోర్ మార్క్ అందుకున్న తీరు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌ను గుర్తు చేస్తోంది. మెహది హసన్ మీర్జా ఓవర్‌లో గిల్ రెండు సిక్సర్లు బాది అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
39 పరుగుల దగ్గర మెహది సంధించిన రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు గిల్. ఆ తర్వాత మూడు, నాలుగు బంతుల్ని డిఫెండ్ చేశాడు. ఆ తర్వాత బంతికి క్రీజు దాటి ముందుకు వచ్చిన గిల్ లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో భారత దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 50, 100 మార్క్‌ను సిక్సర్లతో అందుకుంటాడని, అదే తరహాలో గిల్ కూడా అందుకున్నాడని క్రికెట్ ప్రియులు అంటున్నారు.
Gill Sixes Record : శుభ్‌మన్ గిల్ టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ సరసన చేరాడు. టెస్టు ఫార్మాట్‌లో గిల్, విరాట్ 26 సిక్సర్లు కొట్టారు. గిల్ 26 టెస్టుల్లో, కోహ్లి 114 టెస్టుల్లో ఈ మార్క్‌ను టచ్ చేశారు. ఈ లిస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ (84), ధోనీ (78), సచిన్ తెందుల్కర్ (69), రవీంద్ర జడేజా (66) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఏడో స్థానంలో రిషభ్ పంత్ ఉన్నాడు. అతడు 34 టెస్టుల్లో 57 సిక్సర్లు కొట్టాడు. గిల్, కోహ్లీ వరుసగా 15, 16 స్థానాల్లో నిలిచారు.
Pant Century : స్టార్ వికెట్ కీపర్ పంత్ కూడా తనదైన శైలిలో దూకుడుగా ఆడుతున్నాడు. దాదాపు 20 నెలల తర్వాత టెస్టుల్లోకి అడుగుపెట్టిన అతడు ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రస్తుతం సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో పంత్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. తనకన్నా మరింత దూకుడుగా పంత్ ఆడుతున్నాడని కితాబిచ్చాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీలు కూడా చేసినట్లు గుర్తు చేశాడు.
చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్ - తొలిసారి వన్డే సిరీస్ కైవసం - Afghanistan vs South Africa