తిరుమల లడ్డూ కల్తీపై సమగ్ర విచారణ జరపాలి : రంగరాజన్ - INQUIRY TIRUMALA LADDU ADULTERATION
🎬 Watch Now: Feature Video
Published : Sep 20, 2024, 3:18 PM IST
Rangarajan on Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ కల్తీపై సమగ్ర విచారణ జరపాలని రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. సాక్షాత్తు కలియుగ వైకుంఠమైన తిరుపతి క్షేత్రంలో ఇలాంటి భయంకరమైన దారుణం జరగడం బాధాకరమని అన్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. అలాగే ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తిరుమల పవిత్రతను కాపాడాలని రంగరాజన్ కోరారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వినియోగంపై పెద్ద దుమారం రేగుతోంది. కమీషన్ల కోసమే నాటి ఈవో ధర్మారెడ్డి అర్హత లేని కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారని రాజకీయ పార్టీలు, పలు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు గుజరాత్‌కు చెందిన ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ సంస్థ నివేదికలో సైతం జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీ సర్కార్ కూడా ఈ విషయంపై ఫోకస్ పెట్టింది.