LIVE : దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత న్యాయవాది మోహిత్ రావు - MLC Kavitha Lawyer Press Meet - MLC KAVITHA LAWYER PRESS MEET

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 7:42 PM IST

Updated : May 28, 2024, 9:32 PM IST

MLC Kavitha Lawyer Press Meet : దిల్లీ మద్యం కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో ఈడీ, సీబీఐ వాదనలు విన్న హైకోర్టు జడ్జి జస్టిస్​ స్వర్ణకాంత శర్మ తీర్పు రిజర్వ్​ చేశారు. అయితే ఈడీ ఈ కేసు విషయంలో సంచలన విషయాలను బయటపెట్టింది. మద్యం వ్యాపారం గురించి కేసీఆర్​కు కవిత ముందే వివరాలు చెప్పారని తెలిపింది. ఎమ్మెల్సీ కవిత తన టీమ్​ను దిల్లీలో కేసీఆర్​కు పరిచయం చేశారని చెప్పారు. దిల్లీలోని కేసీఆర్​ అధికారిక నివాసంలోనే కవిత వారిని పరిచయం చేశారని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్​ వివరాలు తెలుసుకున్నారని ఈడీ చెప్పింది. మద్యం వ్యాపారం వివరాలను సమీర్​ను అడిగి కేసీఆర్​ తెలుసుకున్నారన్నారు. కవిత రెండేళ్లలో సుమారు 11 మొబైల్​ ఫోన్లు వాడారంది. నాలుగు ఫోన్లలో ఉన్న ఆధారాలను కవిత ధ్వంసం చేశారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. అయితే ఇప్పుడు కవిత తరఫు న్యాయవాది మీడియాతో ఈ కేసులో వివరాలను వెల్లడించారు.
Last Updated : May 28, 2024, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.