ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతుల ఆందోళన - గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ - Mirchi Farmers Protest
🎬 Watch Now: Feature Video
Published : Mar 1, 2024, 12:52 PM IST
Mirchi Farmers Protest in Khammam Market : ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్ గేటు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలుదారులు సిండికేట్ అయి ధరలు పూర్తిగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ధర్నా చేశారు. కొనుగోళ్లు అడ్డుకొని మార్కెట్ గేటు బయట నిరసన తెలియజేశారు. జెండా పాటకు, కొనుగోళ్లకు సంబంధం లేకుండా వ్యాపారులు సిండికేట్ అయి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
Farmers On Mirchi Price Drop : రూ.20,000 జెండా పాట అయితే ఇవాళ ఏకంగా రూ.16,000కు కొనుగోలు చేస్తున్నారని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిందని, ఇలా అయితే బతికేది ఎలా అని వాపోయారు. కనీసం రూ.20000 మద్దుతు ధర పలికితేనే, గిట్టుబాటు అవుతుందని లేకుంటే రోజూవారి కూలీ ఇచ్చేందుకు కూడా సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు మిర్చి ధరను పూర్తిగా తగ్గించారని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు ధర్నాకు దిగారు.