LIVE : జలసౌధలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ ప్రెస్​మీట్​ - ప్రత్యక్ష ప్రసారం - Minister Uttam Live - MINISTER UTTAM LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 4:00 PM IST

Updated : Jul 26, 2024, 4:59 PM IST

Minister Uttam Kumar Reddy Live : బీఆర్​ఎస్​ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. దానితోపాటు కన్నెపల్లి పంప్‌హౌస్‌, ఎల్ఎండీ రిజర్వాయర్ కూడా సందర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి బీఆర్ఎస్​ బృందం చేపట్టిన కాళేశ్వరం పర్యటనపై హైదరాబాద్​ జలసౌధలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం అట్టహాసంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందని మంత్రి ఉత్తమ్​ విమర్శిస్తున్నారు. అంతకుముందే 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా రూ.38 వేల కోట్ల అంచనాతో కాంగ్రెస్‌ సర్కార్​ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందని గుర్తు చేశారు. అలాంటి ప్రాజెక్టును కేసీఆర్‌ పక్కకు నెట్టారని మంత్రి విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద నీరు లేదని ప్రాజెక్టు డిజైన్‌ మార్చేశారని, కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. హైదరాబాద్​లో మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి నిర్వహించిన ప్రెస్​మీట్​ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : Jul 26, 2024, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.