గాంధీభవన్‌కు వినతుల వెల్లువ - రెండోరోజూ కొనసాగిన మంత్రుల ముఖాముఖి - Ministers Meet with People - MINISTERS MEET WITH PEOPLE
🎬 Watch Now: Feature Video
Published : Sep 27, 2024, 9:50 PM IST
Ministers Meet with People In Gandhi Bhavan : ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలకు చేరువై వారి సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్‌లో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలి రోజు బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ హాజరయ్యారు. రెండోరోజూ శుక్రవారం ప్రజల ముఖాముఖికి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హజరయ్యారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రధానంగా రహదారులు నిర్మించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని, రైతు రుణాలు, సీఎంఆర్ఎఫ్ నిధులు, బదిలీలు, భూ సమస్యలపై విజ్ఞప్తులు ఎక్కువగా వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ 20 మందికి పైగా జనంతో కలిసి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంపై మంత్రి ఉత్తమ్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.