అందుకే అన్ని పార్టీల సభ్యులకు మేడిగడ్డ చూపించాలని నిర్ణయించాం : శ్రీధర్ బాబు - sudheer bbu slams brs ruling
🎬 Watch Now: Feature Video
Published : Feb 13, 2024, 12:20 PM IST
Minister Sudheerbabu on Medigadda barrage in Assembly : గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల నిర్మాణాలు ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా జరిగాయని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఖజానా వృథా అయిందని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఆయన మేడిగడ్డకు వెళ్లి అక్కడ వాస్తవ విషయాలను పరిశీలిద్దామన్నారు. బ్యారేజీలో అసలేం జరిగిందో ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. అందుకే అన్ని పార్టీల సభ్యులకు మేడిగడ్డ చూపించాలని నిర్ణయించామని తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని, డ్యామ్ డిజైన్లో అనేక తప్పులు ఉన్నాయని శ్రీధర్ బాబు వివరించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన అనేక ప్రాజెక్టులు ఇప్పటికీ దృఢంగా ఉన్నాయని గుర్తు చేశారు. కేవలం ఒక్క పార్టీ నేతలే పరిశీలనకు వెళితే రాజకీయం చేస్తున్నారని అంటారని, అందుకే అందరం కలిసి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో కట్టిన డ్యామ్ల వల్ల అనేక మంది ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. తమకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు ఇప్పటికీ కోరుతున్నారని తెలిపారు.