ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు - minister Shridhar Babu - MINISTER SHRIDHAR BABU
🎬 Watch Now: Feature Video


Published : Jun 23, 2024, 3:37 PM IST
Minister Shridhar Babu : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, రోగులకు మెరుగైన వైద్యం అందించి, ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఎస్ఆర్ నగర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రైవేటు ఆసుపత్రులు సహకరించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచామని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం పేదలకు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలన్నారు. నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్గా పనిచేసిన డా.శరత్ చంద్ర మారుమూల గ్రామాలకు వెళ్లి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని తెలిపారు.