అనసూయగా ప్రారంభమై - మంత్రిగా ప్రజల మన్ననలు పొంది - స్ఫూర్తిదాయకం సీతక్క ప్రయాణం - Minister Seethakka Life Story
🎬 Watch Now: Feature Video
Published : Mar 8, 2024, 2:02 PM IST
Minister Seethakka Life Story : అడవి నుంచి అధికారం వరకు! ఆదివాసీ పల్లెల నుంచి పీహెచ్డీ వరకు! ఆమె ప్రస్తానంలో ఎన్నో మలుపులు, మరెన్నో కష్టాలు. ప్రజల కోసం ప్రజల పక్షాన అడవి బాట పట్టిన ఒకప్పటి అక్క ఇప్పుడు ఆ అడవి బిడ్డల ఆశలకు, వారి అభివృద్ధికి వారధి. ఆమెది చిన్నపటి నుంచి తమ ఉద్యమ ప్రభావిత ప్రాంతం. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వచ్చిన గుత్తికోయలు ఎదుర్కొంటున్న సమస్యలపై పీహెచ్డీ చేశారు.
చదువుకునే రోజుల్లోనే చిన్న చిన్న సమస్యలపై ప్రశ్నించడం, అదే విధంగా సహాయం చేయడం అలవాటైంది. అనసూయగా ప్రారంభమై సీతక్కగా ప్రజల మన్ననలు పొంది ఇప్పుడు డాక్టర్ అనసూయ సీతక్కగా రాష్ట్ర సర్కార్లో మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల సమ్మక్క సారక్కల జాతరను సైతం దిగ్విజయంగా పూర్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతక్క గురించి మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.