శిశు విహార్లో నూతన భవనం - ప్రారంభించిన సీతక్క - మంత్రి సీతక్క
🎬 Watch Now: Feature Video
Published : Jan 29, 2024, 8:26 PM IST
Minister Seethakka Inaugurated Shishu Vihar Health Centre : హైదరాబాద్ స్టేట్ హోం ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు విహార్ చిల్డ్రన్స్ హోమ్ నూతన భవనాన్ని రాష్ట్ర శిశు శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ నూతన భవన నిర్మాణానికి రూ.80 లక్షల సహాయం అందించి మానవతా దృక్పథం చాటుకున్న రేవంత దాస్ గుప్తా, సంతోష్ గుప్తాలను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందించారు.
New Building of Shishu Vihar Children's Home In Hyderabad : ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలకు సంబందించిన నూతన భవన నిర్మాణంలో సహాయపడిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి మంచి పనులు మరిన్ని చేస్తూ పేద ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. మానవత దృక్పథంతో మంచి పనులు చేయడానికి ముందుకు వచ్చిన వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో స్త్రీ, శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం అభివృద్ది పనులు చేస్తామని వెల్లడించారు.