ములుగు జిల్లా, మేడారం ప్రాంతాన్ని పర్యాటక హబ్​గా మారుస్తాం : మంత్రి సీతక్క - sammakka sarakka jatara 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 1:56 PM IST

Minister Seethakka Face2Face about Medaram : సమక్క సారలమ్మ మేడారం జాతర దగ్గరకొచ్చేసింది. ఈ నెల 21న మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే 50 లక్షలమంది దర్శనాలు చేసుకున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఎవరైనా ధరలను పెంచి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్యూ లైన్లు వద్ద కూడా భక్తులకు తాగునీరు అందించే యోచన చేస్తున్నామని అన్నారు. 

Minister Seethakka on Medaram Jatara : భక్తులకు ప్రసాదం ఇచ్చే చర్యలూ తీసుకున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. గవర్నర్, ​ముఖ్యమంత్రి, మంత్రులు ఈ జాతరకు విచ్చేయనున్నారని తెలిపారు. జాతర పరిసరా ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారని అన్నారు. వాహనాల దగ్గర వంటలు చేయొద్దని, దాని వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ములుగు జిల్లాను మేడారంను పర్యాటక హబ్​గా చేస్తామని అంటున్న సీతక్కతో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.