ఇక నుంచి ఆర్టీసీ బస్సులో బడికి - త్వరలోనే అందుబాటులోకి : మంత్రి పొన్నం - telangana school buses fitness

By ETV Bharat Telangana Team

Published : Jul 24, 2024, 2:30 PM IST

thumbnail
ఇకనుంచి పాఠశాల బస్సులకు ఫిట్​నెస్​ తప్పనిసరి : మంత్రి పొన్నం (ETV Bharat)

School Buses Fitness in Telangana : పాఠశాల బస్సులకు ఫిట్​నెస్​ను తప్పనిసరి చేశామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.  బస్సుల్లో మెడికల్​ కిట్​, ఫైర్​ సేఫ్టీ కిట్​తో పాటు ఫోన్​ నంబర్​ ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేస్తామని స్పష్టం చేశారు. పదిహేనేళ్లు పైబడిన బస్సులను తిరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పాఠశాల సమయాల్లో బస్సులను తిప్పేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాసనసభలో బస్సుల ఫిట్​నెస్​, స్కూల్ సమయాల్లో ఆర్టీసీ బస్సులు తిప్పడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన వివరణ ఇచ్చారు.

ఆర్టీసీకి ప్రతి నెలా రూ.300 కోట్లు : ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్​ పేర్కొన్నారు. ఆర్టీసీకి కొత్త బస్సులు కొంటున్నామని వెల్లడించారు. ఆర్టీసీలో 3,035 మంది ఉద్యోగులను నియమిస్తున్నామన్నారు. పనిభారం పెరిగినా ఆర్టీసీ కార్మికులు బాగా పనిచేస్తున్నారని వివరించారు. ఆర్టీసీ కార్మికులను అభినందిస్తున్నామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.