కరీంనగర్ అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్ఠానం త్వరగా నిర్ణయం తీసుకోవాలి : పొన్నం ప్రభాకర్ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 3, 2024, 2:24 PM IST
Minister Ponnam on Karimnagar MP Candidate : కరీంనగర్ ఎంపీ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్‌లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న ఆయన, అనంతరం విద్యార్థులతో, స్థానిక చిరు వ్యాపారులతో ముచ్చటించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికే హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మార్నింగ్ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Minister Ponnam Prabhakar Morning Walk : నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా అధిష్ఠానం ఎవరిని నిర్ణయించినా పార్లమెంట్ పరిధిలోని నలుగురు శాసనసభ్యులు కట్టుబడి ఉంటారని తెలిపారు. ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా అందరం ప్రచార కార్యక్రమంలో పాల్గొంటామని వెల్లడించారు.