దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు : మంత్రి పొన్నం - Ponnam Prabhakar Pays tribute To PV - PONNAM PRABHAKAR PAYS TRIBUTE TO PV

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 1:52 PM IST

PV Narasimha Rao Birth Anniversary 2024 : భారత్ ప్రపంచ దేశాల్లో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి దోహదం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. భూ, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాభివృద్ధికి తోడ్పడ్డారని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని అంబేడ్కర్​ చౌరస్తాలో మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా ఆయన పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ, హుస్నాబాద్ నియోజకవర్గం ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు అని కీర్తించారు. ఆయన మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఎంతో పేరు తెచ్చిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు. విద్యకు ప్రాధాన్యతనిచ్చి, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు తెచ్చి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. పీవీ చూపిన మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా నడవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు హుస్నాబాద్​ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.