మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటించేందుకు కృషి చేస్తాం : మంత్రి పొన్నం - Ponnam Prabhakar news
🎬 Watch Now: Feature Video
Published : Feb 22, 2024, 9:05 PM IST
Minister Ponnam on Medaran Jathara : ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరిగే తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను, జాతీయ ఉత్సవంగా ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో సమ్మక్క సారలమ్మల ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. మహాలక్ష్మి పథకం వల్ల మేడారం జాతరకు మహిళలు అధిక సంఖ్యలో వెళ్లే అవకాశం ఉందనే ఉద్దేశంతో, ఆర్టీసీ తరపున ఈసారి 6000 ప్రత్యేక బస్సులను మేడారంకు నడుపుతున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
Mulkanur Sammakka Saralamma : సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో రాబోయే రెండు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందించాలని, వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్ని ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని అమలై ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వానికి మార్గదర్శనమిచ్చి ఆశీర్వదించాలని సమ్మక్క సారలమ్మలను వేడుకున్నట్లు ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కాంగ్రెస్ కౌన్సిలర్ మొక్కు మేరకు సమ్మక్క సారలమ్మకు ఎత్తు బంగారం తూకం వేయించుకున్నారు.