లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారు : పొన్నం - Minister Ponnam on Development
🎬 Watch Now: Feature Video
Published : Jan 29, 2024, 10:22 PM IST
Minister Ponnam Prabhakar Fire on BRS Leaders : పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అరేపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ భయపడుతున్నారని, ఆయన భయంతో పోటీ చేస్తాడో లేదోనని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజనపై నిపుణులతో కమిటీ వేస్తామని వెల్లడించారు.
Minister Ponnam Latest Comments : నియోజవర్గాల పునర్విభజన శాస్త్రీయ బద్దంగా జరగలేదని మంత్రి పొన్నం(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారాలు మారుతుంటాయని, తాము అధికారంలోకి వచ్చి 60 రోజులు కాకముందే మాజీ మంత్రి కేటీఆర్ అసహనంతో ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. తాను మంత్రి అయినా హుస్నాబాద్ బిడ్డనేనని, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరవాత మాజీ ఎమ్మెల్యే సతీశ్కి ఫోన్ చేసి అభివృద్ధిలో సహకరించాలని కోరానని చెప్పారు. హుస్నాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తానని పేర్కొన్నారు.