భూములు కొల్లగొట్టి సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ కుట్ర : కొండా సురేఖ - Minister Konda Surekha Comments - MINISTER KONDA SUREKHA COMMENTS
🎬 Watch Now: Feature Video
Published : May 4, 2024, 11:39 AM IST
Minister Konda Surekha Fires on KCR : పేద ప్రజల భూములను కొల్లగొట్టి సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గద్దర్ స్మృతి వనం వద్ద జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సంపాదించిన ఆస్తులు కాపాడుకోవటం కోసమే కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల రైతులను ముంచిన వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం సిగ్గుచేటని అన్నారు.
బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచినా దుబ్బాక నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు. మోదీ ప్రభుత్వం వస్తే అంబానీ, అదానీలకు తప్ప పేదలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీకి అమ్మి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని కుటిల ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.