లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు ఖాయం : మంత్రి కోమటి రెడ్డి - Komati Reddy Comments on BRS - KOMATI REDDY COMMENTS ON BRS
🎬 Watch Now: Feature Video
Published : Jun 1, 2024, 7:51 PM IST
Minister Komati Reddy Shocking Comments : తెలంగాణ రాష్ట్ర అవతరణలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర గీతంపై మాజీ మంత్రి కేటీఆర్ మతిభ్రమించిన వాడిలా మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో మీడియా సమావేశంలో ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు అవుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్నీ స్కాంలే జరిగాయని ఆరోపించారు. గొర్రెల పథకంలో భారీ స్కాం జరిగిందని తెలిపారు.
Komati Reddy Lok Sabha Result : లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 స్థానాల్లో గెలుస్తామని కోమటి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పదేళ్లు రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉంటుందని జోస్యం చెప్పారు. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రాజ ముద్రపై అన్ని పార్టీల నేతలతో చర్చించిన తరువాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. జూన్లో అన్ని జిల్లాల్లో మంత్రులు పర్యటిస్తామని, అభివృద్ధిపై వరుసగా సమీక్షలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకీ ప్రజాసంక్షేమమే ముఖ్యమని పేర్కొన్నారు.