ప్రభుత్వాసుపత్రులు మావి అని ప్రజలు అనుకునే విధంగా చేస్తాం : దామోదర రాజనర్సింహ - Damodara at Mahabubnagar hospital - DAMODARA AT MAHABUBNAGAR HOSPITAL

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 6:00 PM IST

Minister Damodara Raja Narasimha On Mahabubnagar Hospital : పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అత్యున్నత ప్రమాణాలతో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 1,000 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ వివరాలను మ్యాప్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. 

ఈ ఏడాది చివరి వరకు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్మాణ సంస్థకు సూచించారు. కొత్తగా నిర్మాణం చేసుకుంటున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు పూర్తిగా 1225 పడకలు, అందుకు అనుగుణంగా డాక్టర్‌లు, ఫార్మాసిస్ట్‌లతో పాటు 600 మందిని ఇందులో నియమించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలు సర్కార్ ఆసుపత్రి నాది అనుకునే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.