ప్లాస్టిక్ బాటిళ్లలతో అందమైన ఇల్లు- 85వేల సీసాలతో ఇలా కట్టేశారు! - House Made With Plastic Bottles - HOUSE MADE WITH PLASTIC BOTTLES
🎬 Watch Now: Feature Video
Published : Aug 15, 2024, 4:58 PM IST
House Made With Plastic Bottles : ప్లాస్టిక్ బాటిళ్లలతో అందమైన ఇంటిని నిర్మించారు ఓ వ్యక్తి. అందుకోసం 85 వేల ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించారు. నిర్మాణంలో ఇటుకలకు బదులు బాటిళ్లను వినియోగించారు. తొలుత తాను పెంచుకుంటున్న కుక్కల కోసం గది నిర్మించాలనుకున్న ఆయన, ఏకంగా పెద్ద ఇంటినే నిర్మించి అబ్బురపరిచారు. 'ప్లాస్టిక్ రీసైక్లింగ్' కాన్సెప్ట్‌తో ఇతర ప్రాంతాలకు వెళ్లి మరీ వినియోగించి పడేసిన బాటిళ్లను సేకరించానని తెలిపారు మహారాష్ట్రకు చెందిన రాజేంద్ర ఇనాందార్.
పుణెలోని సింహగఢ్ ఘెరా గ్రామానికి చెందిన ఆర్కిటెక్ట్ రాజేంద్రకు కొన్నేళ్ల క్రితం ప్లాస్టిక్ బాటిళ్లతో ఇంటిని నిర్మించాలనే ఆలోచన వచ్చింది. అనుకున్న రోజే ఇంటి నిర్మాణ ప్రణాళిక రూపొందించుకున్నారు. కొన్ని నెలలపాటు అనేక ప్రాంతాలకు వెళ్లి ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించారు. ఇటుకలకు బదులు ఆ బాటిళ్లనే నిర్మాణంలో వినియోగించారు. తన ఇల్లంతా పారేసిన బాటిళ్లతోనే నిర్మించారు. ఇప్పుడు తమ ప్రాంతానికి వచ్చిన పర్యటకులు, ప్లాస్టిక్ బాటిళ్లతో రూపొందించిన ఇంటిని చూసి తనను అభినందిస్తున్నట్లు రాజేంద్ర తెలిపారు.