మెగాస్టార్‌ను కలిసిన రష్యా ప్రభుత్వ ప్రతినిధులు - Megastar Chiranjeevi - MEGASTAR CHIRANJEEVI
🎬 Watch Now: Feature Video
Published : Apr 18, 2024, 8:54 PM IST
Megastar Chiranjeevi Met with Culture Ministry of Moscow : మెగాస్టార్ చిరంజీవితో రష్యా రాజధాని మాస్కో ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వారితో భేటీ అయిన చిరంజీవి ఇరు దేశాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధి, సృజనాత్మ రంగాల్లో ప్రోత్సాహకాలపై పరస్పరం చర్చించుకున్నారు. రష్యాలో తెలుగు సినిమా చిత్రీకరణలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని, రెండు పరిశ్రమల మధ్య సృజనాత్మక సహకారం అవసరమని మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, సినీ రంగ సలహాదారులు జులియా గోలుబెవా, ఎకటెరినా జాడే చిరంజీవికి వివరించారు. మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన అంశాల పట్ల హర్షం వ్యక్తం చేసిన చిరంజీవి ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత పెంచేందుకు కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినిమాల చిత్రీకరణల్లో రష్యాకు తగిన ప్రాధాన్యత ఉండేలా తెలుగు సినీ పరిశ్రమ తరపున చిరంజీవి వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.