కదిలిస్తే కన్నీరే - సర్వం కోల్పోయామని సింగ్‌నగర్ వాసుల ఆవేదన - Vijayawada flood
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2024, 4:41 PM IST
Vijayawada Flood : బుడమేరు ఉద్ధృతి కారణంగా విజయవాడలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లన్నీ జల దిగ్బంధం కావడంతో మూడు రోజులుగా జనం ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సరైన ఆహారం, తాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం ఇప్పుడిప్పుడే వారిని చేరుకుంటోంది. బాధితులందరికీ ఆహారం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారులు, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. తాజాగా వరద తగ్గుముఖం పట్టడంతో పలు కాలనీల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
విజయవాడలోని సింగ్‌నగర్ ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. వాంబే కాలనీ వాసులు రైలు పట్టాల మీదుగా నడుచుకుంటూ అయోధ్య నగర్ కట్టకు చేరుకుంటున్నారు. దేవీ నగర్ మెయిన్ రోడ్డుపై నడుము లోతు నీరు చేరడంతో పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. రామకృష్ణాపురంలో రైలు పట్టాలు సమీపంలోని ప్రాంతమంతా నీట మునిగిపోగా న్యూ రాజరాజేశ్వరిపేట పూర్తిగా వరద గుప్పిట్లోనే ఉంది. అన్ని ప్రాంతాల కంటే ఇక్కడ తీవ్రత అధికంగా ఉంది. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో మూడు రోజులుగా ఇళ్లలోనే ఉండిపోయిన జనం ధైర్యం చేసి బయటకు వస్తున్నారు. మరికొందర్ని ప్రభుత్వం బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాశ్ అందిస్తారు.