ఇదేందయ్యా ఇదీ - ఇలాంటోళ్లూ ఉంటారా? - హైదరాబాద్‌లో వింత దొంగతనం - Manholes Chori Case in TS
🎬 Watch Now: Feature Video
Published : Feb 18, 2024, 4:13 PM IST
Manholes Theft Case in Hyderabad : హైదరాబాద్‌లో వింత దొంగతనం జరిగింది. ఆఖరికి మ్యాన్ హోల్స్‌పై ఉన్న మూతలను కూడా వదలటం లేదు. గన్ పార్క్‌లోని అమర వీరుల స్థూపం ముందు ఉన్న మూడు మ్యాన్ హోల్స్‌పై మూతలను దొంగలు ఎత్తుకెళ్లారు. 30 కిలోల పైనే బరువు ఉన్న ఐరన్ మ్యాన్ హోల్స్ మూతలను ఎత్తుకెళ్లడం గమనార్హం. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Manholes Covers Theft : ఘటనపై సైఫాబాద్ పోలీసులు వెంటనే స్పందించి ఆ మ్యాన్ హోల్స్ ఉండే ప్రదేశానికి వెళ్లి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ చోరీ జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఈ చోరీ ఇంటి దొంగల పనా? లేక ఎవరైనా కావాలని చేశారా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ మ్యాన్ హోల్స్‌లో ఎవరూ పడకుండా ఉండేలా సెక్యూరిటీ సిబ్బంది తాత్కాలికంగా జెండాలను పెట్టారు.