ప్రజాభవన్ ముందు మంత్రి సీతక్క కారును ఆపి యువకుడు హల్చల్
🎬 Watch Now: Feature Video
Published : Feb 27, 2024, 4:48 PM IST
Man Halchal In Praja bhavan : హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద యువకుడు హల్చల్ సృష్టించాడు. తన సమస్యను పరిష్కరించాలని ప్రజాభవన్ నుంచి అటుగా వెళ్తున్న తెలంగాణ మహిళా శిశు, సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) కారును ఆపి హంగామా చేశాడు. యువకుడు మల్లాపూర్‌కు చెందిన యోహాన్ సిరిమల్ల. తనకు పోలీసులు అన్యాయం చేశారని, తన బాధను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో నేరుగా చెప్పడానికి అవకాశం ఇవ్వాలని అతడు కోరాడు. తన బాధకు కారణం న్యాయం జరగదనే కారణంతో ప్రజాభవన్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపాడు.
ప్రజాభవన్ ముందు వ్యక్తి హల్చల్ : తాను న్యాయం కోసం పోరాడుతుంటే, పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని యోహాన్ మంత్రి సీతక్కతో ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అతని ఫిర్యాదును స్వీకరించి, న్యాయం జరిగేలా చూడాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఇవాళ మంగళవారం కావడంతో ప్రజాభవన్ అర్జిదారులతో కిక్కిరిసింది.