ETV Bharat / state

అంధుల కోసం తీసుకొచ్చిన ఏఐ స్మార్ట్​ కళ్లద్దాలు - వారి జీవితాల్లో సరికొత్త వెలుగులను నింపుతాయి : గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ - AI POWERED SMART GLASSES

అంధులకు ఏఐ స్మార్ట్‌ కళ్లద్దాలు - కిమ్స్‌ ఫౌండేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో తయారీ - అభినందించిన రాష్ట్ర గవర్నర్‌

AI Powered Smart Glasses for Visually Imperial by KIM
AI Powered Smart Glasses for Visually Imperial by KIM (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2024, 1:53 PM IST

AI Powered Smart Glasses for Visually Imperial by KIMS : అంధుల కోసం తీసుకొచ్చిన స్మార్ట్‌ కళ్లద్దాలు వారి జీవితంలో సరికొత్త వెలుగులు పంచుతాయని, దేశంలో 2 కోట్ల మంది అంధులకు ఇది ఒక భరోసాగా ఉంటుందని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తెలిపారు. ఈ ఏఐ స్మార్ట్‌ కళ్లద్దాలకు రూపకల్పన చేసిన కిమ్స్‌ ఫౌండేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌(కేఎఫ్‌ఆర్‌సీ) బృందాన్ని గవర్నర్‌ అభినందించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రి ప్రాంగణంలో గురువారం అంధుల కోసం రూపొందించిన స్మార్ట్‌ కళ్లద్దాల పంపిణీ కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ మాట్లాడుతూ మనుషులు, వస్తువులను గుర్తించడం లాంటి సామర్థ్యాలు కలిగిన ఏఐ స్మార్ట్‌ కళ్లద్దాలను ఉచితంగా అంధులకు అందజేయడం గొప్ప విషయని కొనియాడారు.

అంధులకు వివిధ రకాల స్మార్ట్‌ పరికరాలు తీసుకువచ్చేందుకు కృషి : కిమ్స్‌ ఆసుపత్రి సీఎండీ డాక్టర్‌ బొల్లినేని భాస్కర్‌రావు మాట్లాడుతూ ఈ అద్దాలు అంధుల్లో మరింత ఆత్మవిశ్వాసం విశ్వాసం వ్యక్తం చేశారు. రోజువారి జీవితంలో ఎంతో సహాయ పడుతుందన్నారు. తొలి విడతలో 100 మందికి ఉచితంగా అందించామని పేర్కొన్నారు. వీటి వాడకంపై అంధులతోపాటు వారి కుటుంబ సభ్యులకు శిక్షణ ఇస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి వ్యవస్థాపక ఛైర్మన్‌ డాక్టర్‌ జీఎన్‌రావు మాట్లాడుతూ, అంధత్వం, దృష్టిలోపం పెద్ద సమస్యగా మారుతోందని అంధులకు వివిధ రకాల స్మార్ట్‌ పరికరాలను తీసుకువచ్చేందుకు ఎల్వీప్రసాద్‌ హాస్పిటల్‌లో సైతం పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. సరిచేయలేని అంధత్వంతో బాధపడేవారికి ఈ అద్దాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే కళ్లద్దాలు వస్తున్నాయి! - మీకు రావొద్దంటే ఈ టిప్స్ పాటించండి! - Best Tips for Eye Health

ఏవైనా సమస్యలు తలెత్తితే : ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వైద్యసేవల సంస్థల సాయంతో ఈ కళ్లద్దాలను అంధులకు పంపిణీ చేయిస్తామని కేఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్, డీఆర్‌డీవో మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ వి.భుజంగరావు చెప్పారు. అచల సొల్యూషన్స్‌ సీఈఓ రాజేష్‌రాజు మాట్లాడుతూ ఏఐ స్మార్ట్‌ కళ్లద్దాల్లో ఏదైనా సాంకేతిక సమస్య లేక ఇతర ఏవైన ఇబ్బందులు తలెత్తితే అచల సొల్యూషన్స్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించాలని తెలిపారు.

డీఆర్‌డీఓ మాజీశాస్త్రవేత డాక్టర్‌ వి.భుజంగరావు నేతృత్వంలో కిమ్స్‌ ఫౌండేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌(కేఎఫ్‌ఆర్‌సీ) ఈ కళ్లద్దాలను రూపొందించింది. 2010లో కిమ్స్‌ ఆసుపత్రి సీఎండీ డాక్టర్‌ బొల్లినేని భాస్కర్‌రావు ఈ ఫౌండేషన్‌ను స్థాపించగా, రాజేష్‌ రాజు స్థాపించిన టెక్నాలజీ కంపెనీ అచల హెల్త్‌ సర్వీసెస్‌తో కలిసి కేఎఫ్‌ఆర్‌సీ ఈ ఏఐ స్మార్ట్‌ కళ్లద్దాలను రూపొందించారు.

అంధులు ఈ కళ్లద్దాలు పెట్టుకుంటే చాలు - ఎవరి సాయం లేకుండానే నడిచేయొచ్చు..!

లేజర్ చికిత్సతో కంటి సమస్యలు పూర్తిగా తగ్గుతాయా?.. అందరూ చేయించుకోవచ్చా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.