ETV Bharat / offbeat

లేత వంకాయలతో "కమ్మని గుజ్జు కూర" - మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే! - VANKAYA GUJJU KURA

- గుత్తివంకాయను మించిన టేస్ట్​ - అన్నం, చపాతీల్లోకి రుచి అద్భుతం

Vankaya Gujju Kura
How to Make Vankaya Gujju Kura (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 12:35 PM IST

How to Make Vankaya Gujju Kura : చాలా మందికి ఇష్టమైన కూరగాయలలో వంకాయ కూడా ఒకటి. కానీ, కొంతమంది గుత్తివంకాయ మసాలా కర్రీనే ఎంతో ఇష్టంగా తింటారు. అయితే.. ఎప్పుడూ గుత్తివంకాయ వండడం వీలుకాదు. ఎందుకంటే ఈ రెసిపీ చేయడానికి కాస్త ఎక్కువ టైమ్​ పడుతుంది. అంత టైమ్ లేనప్పుడు.. ఈ విధంగా "వంకాయ గుజ్జు కూర" చేయండి. ఇలా చేస్తే అన్నం ఒక్క మెతుకు మిగల్చకుండా పూర్తిగా తింటారు. ఈ రెసిపీ వేడివేడి అన్నంతో పాటు, చపాతీల్లోకి రుచి అద్భుతంగా ఉంటుంది. మరి సింపుల్​గా వంకాయ గుజ్జు కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • లేత వంకాయలు-పావు కేజీ
  • టమాటాలు-2
  • ఉల్లిపాయలు-2
  • పచ్చిమిర్చి-3
  • ఇంగువ-రెండు చిటికెలు
  • ఉప్పు-రుచికి సరిపడా
  • కారం-రుచికి సరిపడా
  • నూనె
  • ఉసిరికాయ సైజంత-చింతపండు
  • పసుపు-పావు టీస్పూన్​
  • ధనియాలపొడి-టీస్పూన్​
  • జీలకర్రపొడి-పావు టీస్పూన్​

తాలింపు కోసం :

  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • మెంతులు-2 చిటికెలు
  • ఆవాలు - అర టీస్పూన్
  • జీలకర్ర - అర టీస్పూన్
  • మినప్పప్పు- అర టీస్పూన్
  • శనగపప్పు- అర టీస్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు-5
  • ఎండుమిర్చి - 3
  • కరివేపాకు- 2 రెమ్మలు

తయారీ విధానం :

  • ముందుగా వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలను శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి.
  • ఆ తర్వాత వంకాయలపైనున్న తొడిమ తీసేసి ముక్కలుగా కట్​ చేసుకోవాలి. (ఈ రెసిపీకి వంకాయ తొడిమ ఉండకూడదు.)
  • ఈ ముక్కలను ఉప్పు నీటిలో వేసుకోండి. అవి రంగు మారకుండా ఉంటాయి. అలాగే ఉల్లిపాయ, టమాటాలను సన్నగా కట్​ చేసుకోవాలి.
  • చింతపండు నీటిలో నానబెట్టుకోండి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టండి. టేబుల్​స్పూన్​ ఆయిల్​ వేసి వేడి చేయండి. ఆపై ఇంగువ వేయండి. అది వేగిన తర్వాత.. వంకాయ ముక్కలు, ఆనియన్స్​ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
  • ఇప్పుడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి 5 నిమిషాలు మగ్గించుకోండి.
  • తర్వాత టమాటా ముక్కలు వేసి కలపండి. స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి కాయగూరలను 10 నిమిషాలు మగ్గించుకోండి.
  • ఇప్పుడు స్టౌ ఆఫ్​ చేసి, వీటిని చల్లారనివ్వండి.
  • ఆపై మిక్సీ గిన్నెలో వేసుకుని కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు కూర తాలింపు పెట్టడం కోసం స్టౌపై గిన్నె పెట్టండి. ఇందులో 2 టేబుల్​స్పూన్ల ఆయిల్​ వేసి వేడి చేయండి.
  • నూనె వేడయ్యాక మెంతులు వేసి ఎర్రగా వేపుకోండి. ఆపై ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి ఫ్రై చేసుకోండి.
  • అలాగే కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి, కరివేపాకులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేపండి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత గ్రైండ్​ చేసుకున్న వంకాయ కూర వేసి కలుపుకోండి.
  • కూరలో తాలింపు కలిసిన తర్వాత.. కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి వేసుకుని బాగా కలుపుకోండి. ఆపై చింతపండు రసం పోసుకుని మిక్స్​ చేయండి.
  • ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోండి. గ్రేవీ చిక్కగా ఉంటే కొన్ని నీళ్లను పోసుకుని కలుపుకోండి.
  • పైన ఆయిల్​ సెపరేట్​ అయిన తర్వాత.. కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గుజ్జు కూర రెడీ. నచ్చితే ఈ విధంగా ఓసారి కర్రీ ఇలా ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

లఖ్​నవూ స్పెషల్​ "మలై గుత్తొంకాయ కుర్మా" - ఒక్కసారి టేస్ట్ చేశారంటే జిందగీ ​ఖుష్ అయిపోతుంది!

గుత్తి వంకాయతో ఘుమఘమలాడే దమ్ బిర్యానీ - ఒక్కసారైనా తిని తీరాల్సిందే గురూ! - ఇలా ప్రిపేర్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.