సీఎం రేవంత్ రెడ్డి​ ఇంటి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం - కారణం తెలిస్తే షాక్! - MAN SUICIDE ATTEMPT AT CM HOUSE - MAN SUICIDE ATTEMPT AT CM HOUSE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 4:13 PM IST

Man Attempt to Suicide in Front Of CM Revanth House : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన ఆ వ్యక్తి, శరీరంపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే తేరుకున్న పోలీసులు అతన్ని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆ ప్రాంతమంతా వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు బాధితుడిని విచారించగా, తనకు సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఈ ఘటనకు ఒడిగట్టినట్టు తెలిపాడని పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా పార్లమెంట్​ ఎన్నికల వేళ కాంగ్రెస్​లోకి ఇతర పార్టీల నేతలు భారీగా చేరుతున్నారు. దీంతో జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసం వద్ద కార్యకర్తలు, అనుచరులతో సందడిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సీఎం నివాసం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. వారందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకోగా, పోలీసుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.