'6 గ్యారంటీలు, 66 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ - 9 నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయింది' - Etela Rajender Fires On CM Revanth
🎬 Watch Now: Feature Video
MP Etela Rajender Fires on CM Revanth : 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులతో అడ్డదారిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కాక రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. శంషాబాద్లో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల, కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. హస్తం పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదిన కానుకగా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసి, పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.
తక్షణమే బేషరతుగా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్న రేవంత్ రెడ్డి, ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతగానే మిగిలిపోయాయన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముచ్చర్ల ఫార్మాసిటీ రద్దు చేస్తామని వాగ్దానం ఇచ్చి, 9 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఫార్మాసిటీ పైన స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదని మండిపడ్డారు. ఫార్మాసిటీ రద్దుచేసి రైతుల భూములను టీఎన్ఐఐసీ ప్రభుత్వ లాగిన్ల నుంచి విడుదల చేయాలని ఈటల రాజేందర్ కోరారు.