డ్రైవర్ కుమార్తెకు ఇంటర్లో 986 మార్కులు - ప్రభుత్వ కాలేజీ అయినా అన్ని మార్కులు ఎలా సాధించిందంటే? - 986 Marks for Driver Daughter - 986 MARKS FOR DRIVER DAUGHTER
🎬 Watch Now: Feature Video
Published : Apr 30, 2024, 4:06 PM IST
Malakpet Government College Student Shravani Interview : తండ్రి ఒక సాధారణ డ్రైవర్. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఇవన్నీ ఆ అమ్మాయిని ఆలోచింపజేశాయి. ఎలాగైనా కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించి, తానూ ఒక మంచి స్థాయిలో ఉండాలని భావించింది. అందుకు చదువు ఒక్కటే మార్గమని నమ్మింది. కష్టపడి చదివి పదో తరగతిలో 10 జీపీఏతో సత్తా చాటింది. ఇంటర్ ప్రభుత్వ కళాశాలలో చేరి అహర్నిశలు శ్రమించింది.
ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి 986 మార్కులు సాధించి మరోసారి తానేంటో నిరూపించుకుంది. అందరిచేత శెభాష్ అనిపించుకుంది. అంతే కాదు ఎంసెట్ (టీఎస్ ఈఏపీసెట్)లో మంచి ర్యాంకు సంపాధించడమే తన లక్ష్యం అంటోంది హైదరాబాద్ మలక్‌పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి 986 మార్కులు సాధించిన శ్రావణి. మరి ఇన్ని మార్కులు సాధించడం వెనకాల ఆమె కృషి ఏంటి? తన భవిష్యత్ లక్ష్యమెంటో ఇప్పుడు శ్రావణి మాటల్లోనే విందాం.