గణతంత్ర వేడుకల్లో కళ్లు తిరిగి పడిపోయిన మహమూద్ అలీ - హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు - మహమూద్ అలీకి అస్వస్థత
🎬 Watch Now: Feature Video
Published : Jan 26, 2024, 3:11 PM IST
Mahmood Ali Fainted At Republic Day Celebrations 2024 : రాష్ట్రవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. శాసనసభ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గాంధీజీ, అంబేడ్కర్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు.
Mahmood Ali Fainted Video Viral : రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సైతం తమ తమ పార్టీ కార్యాలయాల్లో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాయి. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే పార్టీ శ్రేణులు ఆయణ్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.