LIVE : లోక్​సభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - Lok Sabha Session 2024 Live updates

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 11:07 AM IST

Updated : Feb 9, 2024, 11:20 AM IST

Lok Sabha Sessions 2024 Live : లోక్​సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో మోదీ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చాలా కాలం విపక్షాలు ప్రతిపక్ష హోదాలోనే ఉంటాయని, వాటి దుస్థితికి కాంగ్రెస్​ కారణమని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లలో, ఎన్​డీఏ 400లకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఎన్​డీఏ మూడో టర్మ్​లో గవర్నన్స్​లో అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంటామని మోదీ స్పష్టం చేశారు. వెయ్యేళ్లకు అవసరమైన బలమైన పునాది వేస్తామని చెప్పుకొచ్చారు. 

కాగా లోక్​సభలో శ్వేత పత్రం విడుదల చేశారు. 2004 నుంచి 2014 వరకు సాగిన యూపీఏ పాలనలో ఆర్థిక దుర్వినియోగం జరిగిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆ పదేళ్ల పాలనలోని సంక్షోభాలను అధిగమించి దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి చెందే సంస్కరణలను తీసుకొచ్చామని చెప్పారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ గమ్యం అని, ఆ ప్రయాణంలో ఇంకా మైళ్ల దూరం వెళ్లాలని, పర్వతాలు అధిరోహించాలని ఆమె అన్నారు.

Last Updated : Feb 9, 2024, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.