LIVE: లోక్సభ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - Lok Sabha Sessions 2024 - LOK SABHA SESSIONS 2024
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 27, 2024, 10:58 AM IST
|Updated : Jun 27, 2024, 12:17 PM IST
Lok Sabha Sessions 2024 Live : 18వ లోక్సభ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈరోజు (జూన్ 27వ తేదీ) ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. తర్వాత ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ వంటివి ఉంటాయి. ఈ సభ వాయిదా తర్వాత వర్షాకాల సమావేశాల నిమిత్తం జులై 22వ తేదీన పార్లమెంటు మళ్లీ సమావేశమైనప్పుడు కేంద్ర బడ్జెట్ సమర్పించే అవకాశం ఉంది. ఈనెల 24వ తేదీన 18వ లోక్సభ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రొటెం స్పీకర్ను ఎన్నుకున్న తర్వాత ఆయన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిరోజు 262 మంది, రెండో రోజు మిగతా సభ్యులు ప్రమాణం చేశారు. ఇక 26వ తేదీన లోక్సభ స్పీకర్ను ఎన్నుకున్నారు. ఎన్డీఏ, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నిక జరపాల్సి వచ్చింది. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు మూజువాణి ఓటుతో మద్దతు పలకడంతో ఆయన విజయం సాధించారు. అలా ఓం బిర్లా రెండోసారి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు.
Last Updated : Jun 27, 2024, 12:17 PM IST