LIVE: లోక్సభ సమావేశాలు - లోక్సభ స్పీకర్ ఎన్నిక - ప్రత్యక్ష ప్రసారం - Lok Sabha Sessions 2024
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 11:02 AM IST
|Updated : Jun 26, 2024, 1:15 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-06-2024/640-480-21798032-thumbnail-16x9-lok-sabha-sessions-2024-live.jpg)
Lok Sabha Sessions 2024 Live : 18వ లోక్సభ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. తొలి రెండ్రోజుల్లో ఈనెల 24, 25వ తేదీల్లో ఎంపీలుగా ఎన్నికైన సభ్యులచేత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంగ్లం, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈరోజు స్పీకర్ ఎన్నిక జరుగుతోంది. లోకసభ స్పీకర్గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ సభలో ప్రధాని మోదీ తీర్మానం ప్రవేశ పెట్టారు. రాజ్నాథ్ సింగ్ ఈ తీర్మానాన్ని బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరఫున కె.సురేశ్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఈ నెల 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అనంతరం దానిపై చర్చా కార్యక్రమం ఉంటుంది. ఈసారి ప్రతిపక్ష నాయకులు నంబర్ సైతం బాగానే ఉంది. లోక్సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యులు, విపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీలున్నారు.