LIVE : బిహార్‌ సీఎంగా నీతీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం - ప్రత్యక్షప్రసారం - Bihar CM Nitish Kumar Sworn

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 4:56 PM IST

Updated : Jan 28, 2024, 5:33 PM IST

Nitish Kumar Sworn in as Bihar CM LIVE : బిహార్‌లో రాజకీయాలు క్షణక్షణం (Bihar Political Crisis) ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఆర్జేడీతో బంధం తెంచుకున్న ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ, బీజీపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేసింది. ఈ క్రమంలోనే నీతీశ్‌ కుమార్‌ తన ముఖ్యమంత్రి పదవికి ఇవాళ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. నీతీశ్​ రాజీనామాను గవర్నర్​ ఆమోదించారు. మొత్తానికి బిహార్​లో నాటకీయ పరిణామాల మధ్య ఎన్​డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీజేపీ నుంచి ఇద్దరు నేతలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు నీతీశ్​ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ, హెచ్​ఏఎమ్​, ఒక స్వంతంత్ర్య అభ్యర్థి గవర్నర్​ రాజేంద్ర ఆర్లేకర్​ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరారు. అందులో భాగంగానే ఇవాళ సాయంత్రం మరోమారు ముఖ్యమంత్రిగా నీతీశ్​ కుమార్ ప్రమాణస్వీకారం చేస్తున్నారు.

Last Updated : Jan 28, 2024, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.