LIVE : వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రత్యక్ష ప్రసారం - TELANGANA FLOODS LIVE - TELANGANA FLOODS LIVE
🎬 Watch Now: Feature Video


Published : Sep 4, 2024, 1:28 PM IST
|Updated : Sep 4, 2024, 9:12 PM IST
TELANGANA FLOODS UPDATES LIVE : తెలంగాణలో గత రెండ్రోజుల క్రితం కురిసిన వర్షాలు విలయాన్ని సృష్టించాయి. చాలా ప్రాంతాలను జలదిగ్బంధం చేశాయి. వర్షం తగ్గి రెండ్రోజులవుతున్నా ఇప్పటికీ పలు ప్రాంతాలు వరద ముంపులోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక వరద తగ్గిన ప్రాంతాల్లో తమ ఇళ్లను చూసిన బాధితులు కన్నీరు పెడుతున్నారు. ఇళ్లంతా బురదమయం అవ్వడం చూసి ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. జోరువానలకు వాగులు పొంగిపొర్లి పంట పొలాల్లోకి భారీగా వరద నీరు ప్రవహించి పంటలు నీటమునిగాయి. మరోవైపు మున్నేరు నది వరద ఖమ్మం నగరానికి తీవ్ర నష్టం చేకూర్చింది. మున్నేరు పరివాహక కాలనీల్లో ప్రజలు తీవ్రంగా నష్టం పోయారు. ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో ప్రజలు పరుగులు పెట్టారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 36 అడుగులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
Last Updated : Sep 4, 2024, 9:12 PM IST