LIVE : సభా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం - CM REVANTH REDDY PRESS MEET - CM REVANTH REDDY PRESS MEET
🎬 Watch Now: Feature Video
Published : Apr 4, 2024, 8:58 PM IST
|Updated : Apr 4, 2024, 9:05 PM IST
CM Revanth Inspect to Tukkuguda Congress Meeting Arrangements : కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు హైదరాబాద్ తుక్కుగూడ సభ వేదికగా కానుంది. గత ఏడాది సెప్టెంబరు 17న జరిగిన సభ కంటే, ఈ నెల 6న నిర్వహించే జన జాతర సభకు భారీగా జనసమీకరణ చేయాలని పీసీసీ నిర్ణయించింది. దీంతో సభా ప్రాంగణం తదనుగుణంగా ముస్తాబవుతోంది. రెండు రోజుల క్రితం మీటింగ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కూడా పరిశీలించారు. అనంతరం మాట్లాడిన సీఎం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన మహాలక్ష్మీ పథకం మహిళల సాధికారతకు కొత్త బాటలు వేసిందని, మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు కొత్త ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఇంటింటికీ ఆర్థిక తోడ్పడుతున్నాయని అన్నారు. ఇదే స్ఫూర్తితో దేశంలోని ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే హామీ వారిని విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. నారీమణులు కాంగ్రెస్‌కు దగ్గరైతే ఓట్ల రూపంలో లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు సైతం తుక్కుగూడ సభ వేదికగానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.
Last Updated : Apr 4, 2024, 9:05 PM IST