LIVE : జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ రోడ్ షో - KTR Road Show at Jubilee Hills - KTR ROAD SHOW AT JUBILEE HILLS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-05-2024/640-480-21371284-thumbnail-16x9-ktr-road-show.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : May 2, 2024, 8:09 PM IST
|Updated : May 2, 2024, 8:29 PM IST
KTR Road Show at Jubilee Hills Live : అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే సాకుతో ఎన్నికల కమిషన్, తెలంగాణ ఆవాజ్ కేసీఆర్ గొంతు పైనే నిషేధం విధించడం అరాచకమంటూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈసీ తీసుకున్న నిర్ణయంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. నేడు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? అని ప్రశ్నించారు. మోదీ ప్రసంగాలపై వేల ఫిర్యాదులు వచ్చినా చర్యల్లేవు అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? అని విరుచుకుపడ్డారు. బడే భాయ్, చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కేసీఆర్ పోరు బాట కార్యక్రమం చూసి ఎందుకు కాంగ్రెస్, బీజేపీ వాళ్లు వణికిపోతున్నారని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అహంకారానికి, సంస్థాగత దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్ పట్ల కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Last Updated : May 2, 2024, 8:29 PM IST