శ్రీ చైతన్యలో విద్యార్థుల మధ్య ఘర్షణ - రాడ్లతో దాడి, ముగ్గురికి తీవ్ర గాయాలు - Clash between students in Chaitanya

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 7:55 PM IST

Kompally Sri Chaitanya Students Clash : పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాలు అయిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొంపల్లి శ్రీ చైతన్య స్కూల్లో శనివారం ఉదయం 8 గంటలకు బ్రేక్ సమయంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు, 9వ తరగతి చదువుతున్న మరొక విద్యార్థి ఒకచోట ఉండి మాట్లాడుకుంటూ ఉండగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఏడుగురు వారిపై రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. దీంతో ఆ ముగ్గురు విద్యార్థులు తలకు గాయాలవటంతో సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.

ముగ్గురు విద్యార్థుల తలకు తీవ్ర గాయాలు అవటంతో కుట్లు వేసి పాఠశాలకు పంపించినట్లు వైద్యులు చెబుతున్నారు. గొడవ విషయం గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు మొదట స్కూల్​కు వచ్చి అనంతరం అక్కడి నుంచి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. అయితే అక్కడ పోలీసులు ఇది పాఠశాల విద్యార్థులకు చెందిన సున్నితమైన అంశమని, కేసు వరకు వెళ్తే పిల్లల భవిష్యత్​ ఆగమయ్యే అవకాశం ఉందని, స్కూల్లోనే చర్చించుకోవాల్సిందిగా సూచించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో గాయపడిన తమ పిల్లలకు న్యాయం చేయాల్సిందిగా తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.